ఛత్తీస్ ఘడ్ ఎన్కౌంటర్ పట్ల సీపీఎం ఖండన
Uncategorizedకేంద్ర ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేయాలి
సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టులపై జరిగిన ఎన్‌కౌంటర్‌ను సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందని, కేంద్రం, ఆ రాష్ట్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపకపోవడం, అమానుష హత్యలు చేసిందని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు అన్నారు.
ఈ రోజు సీపీఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ
ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు సహా 27 మంది మావోయిస్టుల ఎన్కౌంటర్ చేయడం అమానవీయ ఘటనగా పేర్కొన్నారు. మావోయిస్టులు చర్చల కోసం పలుమార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం, ఛత్తీ్‌సగఢ్ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. ప్రభుత్వాలు చర్చల ద్వారా పరిష్కారానికి ప్రయత్నించకపోగా అమానుష హత్యాకాండకు పాల్పడడమే తమ విధానంగా మార్చుకున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. మావోయిస్టులను అంతం చేస్తామంటూ కేంద్ర హోం మంత్రి డెడ్‌లైన్ ప్రకటిస్తుండడం, చర్చల అవసరం లేదని ఛత్తీ్‌సగఢ్ ముఖ్యమంత్రి చెబుతుండడం వారి ఫాసిస్టు మనస్తత్వానికి నిదర్శనమని, వారి తీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొన్నారు. కేంద్రం వెంటనే చర్చల కోసం మావోయిస్టుల విజ్ఞప్తిని అంగీకరించాలని, వారిపై పారా మిలిటరీ ఆపరేషన్లను నిలిపివేయాలని కోరారు.
ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మానిక్, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ, నాయకులు అశోక్, రాజయ్య, బాలరాజు, అర్జున్, తది తరులు పాల్గొన్నారు.