జక్కలొద్ది గుడిసె వాసులకు న్యాయం కావాలి–తప్పుడు ప్రచారాలను ఖండించిన పేదలు
Uncategorized
ఈ69న్యూస్ వరంగల్,జూలై 21:
వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం కేంద్రంలోని జక్కలొద్ది శివారులో గత ఐదు సంవత్సరాలుగా నిలువనీడ లేకపోయిన పేద ప్రజలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వారు ఈ గుడిసెలపై రెండుసార్లు బుల్డోజర్లు పరుగెత్తించి పేదల నివాసాలను కూల్చేసింది.ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా గుడిసె వాసులకు న్యాయం చేస్తామని, పక్కా ఇళ్లు,పట్టాలు అందిస్తామని హామీ ఇచ్చారు.జిల్లా మంత్రివర్యులు కొండా సురేఖ,మురళీధర్ దంపతులు పేదల కష్టాలను గమనించి వారికి నీరు,కరెంట్ లాంటి మౌలిక సదుపాయాలు అందించడంలో నడుం బిగించారు.దీంతో గుడిసె వాసులు“కొండా సురేఖ అమ్మ మాకు తల్లిలాంటి వారు”అంటూ హర్షం వ్యక్తం చేశారు.అయితే ఇటీవల,కొన్ని సీపీఎం మాజీ నాయకులు మరియు ఇతర వ్యక్తులు కలిసి మరో పార్టీకి వెళ్లి,గుడిసె వాసుల పేర్లను ఉపయోగించి తప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారని,ఆ పేర్లతో డబ్బులు వసూలు చేయాలని కుట్ర పన్నుతున్నారని స్థానికులు ఆరోపించారు.గుడిసె వాసుల పర్యవేక్షణ కమిటీకి చెందిన గ్రామ గౌరవ అధ్యక్షుడు రామలడ్డూ,అధ్యక్షుడు కలకోటి శ్యామ్,ఉపాధ్యక్షులు మైదం వినోదమ్మ,దుప్పటి రమ్య,సట్ల రజిత,ఎండి యాకూబ్ పాషా,సోషల్ మీడియా కోఆర్డినేటర్ గజ్జ చందు లు ఆ వ్యక్తులను పెద్దమనుషుల సమక్షంలో ప్రశ్నించారు.దీనిపై పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన వారు తమ తప్పును అంగీకరించారని,పేపర్లో వేసిన ఫోటో కూడా పాతదేనని స్వయంగా ఒప్పుకున్నారని గుడిసె వాసులు తెలిపారు.“కొండ సురేఖమ్మ మాకు తల్లి లాంటి వారు, మమ్మల్ని క్షమించండి”అంటూ వారు చెప్పినట్టు వెల్లడించారు.వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు కి తమ నమ్మకం ఉందని, తప్పుడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని గుడిసె వాసులు డిమాండ్ చేశారు.తమకు రాహుల్ గాంధీ,సీఎం రేవంత్ రెడ్డి,కొండా దంపతులు,ఎమ్మెల్యే కేఆర్ నాగరాజులు నాయకత్వమే చాలని,ఇతర పార్టీలు అవసరం లేదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పూల రాకేష్,పుట్ట అనిల్,చందర్,వంశీ,కొండల్ తదితర గుడిసె వాసులు పాల్గొన్నారు.
– ఈ69 న్యూస్, జక్కలొద్ది, వరంగల్
తేదీ: 21 జూలై 2025