అండర్ గ్రౌండ్ పెద్ద మోరి పనులు నత్తనడక నడుస్తున్నాయని ఆందోళన ఈ69న్యూస్:జనగామ పట్టణంలోని జ్యోతి నగర్లో నిర్మాణంలో ఉన్న అండర్ గ్రౌండ్ పెద్ద మోరి పనులు నత్తనడక నడుస్తున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే ప్రారంభమైన పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో విద్యార్థులు,తల్లిదండ్రులు,వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశముందని,వెంటనే పనులను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సిపిఎం సభ్యులు పల్లెర్ల లలిత,గాడి శివ,గుండు శ్రీనివాస్,రామా తేజ,ఓధ్య నాయక్,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.