
సార్వత్రిక సమ్మెకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) సంఘీభావం
ఈ69న్యూస్ జనగాం,జూలై 9:దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సార్వత్రిక సమ్మెకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) సంఘీభావం తెలిపింది.జనగాం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.జిల్లా అధ్యక్షుడు నీల నరేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్లాల జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే విరమించుకోవాలని,40కి పైగా కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను బలవంతంగా అమలు చేయాలని చేసే ప్రయత్నాలు తగదు అని హెచ్చరించారు.ఈ కోడ్లు కార్మికుల హక్కులు,జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్నాయని విమర్శించారు.జర్నలిస్టుల హక్కులను పరిరక్షించేందుకు టీడబ్ల్యూజేఎఫ్ నిరంతరం పోరాడుతుందని రాష్ట్ర ఉపాధ్యక్షులు వల్లాల జగన్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి కూచన సుప్రీం,ఉపాధ్యక్షులు చింతల మధు,క్రిష్ణ జానకిరాము,బచ్చన్నపేట మండల అధ్యక్షుడు జంగిలి సాయిబాబా,నరేష్,రంజిత్,గోవర్ధన్,గోవర్ధనాచారి తదితరులు పాల్గొన్నారు.