జనగామలో ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల వారోత్సవం ప్రారంభం
ఈ69న్యూస్ జనగామ: జిల్లా కేంద్రంలోని యూపీహెసీ ఆసుపత్రిలో సోమవారం ప్రత్యేక వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని జిల్లా వైద్య అధికారి డా. మల్లిఖార్జున్ రావు ప్రారంభించారు. ఏప్రిల్ 21 నుంచి 28 వరకు ఈ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు టీకాలు వేయించని పిల్లలు, లేదా మధ్యలో మోతాదులు మిస్సైనవారికి టీకాలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. మురికి వాడలు, బస్తీలు, కార్మిక శిబిరాల్లో నివసించే పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆశా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.