జనగామలో వాన్స్‌కు వ్యతిరేకంగా రైతుల నిరసన
ఈ69న్యూస్ జనగామ: అమెరికా ఉపాధ్యక్షులు వాన్స్ పర్యటనకు వ్యతిరేకంగా “వాన్స్ గో బ్యాక్” నినాదాలతో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నదని, స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం గిట్టుబాటు ధరలకు హామీ చట్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.