జనగామలో శరవేగంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
Uncategorized
జనగామలో శరవేగంగా సాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం
రెండో విడత బిల్లులుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి రూ. లక్ష చొప్పున నగదు జమ
హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు
ఈ69న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద ప్రజల నిధానమైన ఇంటి కలను నిజం చేస్తోంది.”కూడు-గూడు-బట్ట”అనే మానవుని ప్రాథమిక అవసరాల్లో గూడుకి మరింత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం,లక్షలాది నిరుపేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా ఆశాజ్యోతి పోశుతోంది.జనగామ జిల్లాలోని 12 మండలాల్లో ఒక్కో మండలానికి చెందిన ఒక గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి మొత్తం 716 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించింది.వీరిలో 450 మంది ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించగా,ఇప్పటికే 182 మందికి స్లాబ్ స్థాయిలో రూ.లక్ష చొప్పున నగదు జమ అయింది.తాజాగా 15 మందికి రూఫ్ లెవల్ నగదు జమ చేయడం ద్వారా రెండో విడత పూర్తయింది.జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రకటనలో పేర్కొన్నట్లుగా,ప్రభుత్వం నిర్మాణ పురోగతిని దశలవారీగా పరిశీలించి,బేస్మెంట్ పూర్తి చేసిన వారికి మొదటి విడతలో రూ.లక్ష, రూఫ్ లెవల్ చేరుకున్న వారికి రెండో విడతగా రూ.లక్ష చొప్పున నగదు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తోంది.ఇంటి నిర్మాణం పూర్తయ్యాక మొత్తం రూ.5 లక్షలు అందించనుంది.
లబ్ధిదారుల స్పందనలు
చింతకుంట్ల సరిత,లింగాల ఘనపురం మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆమె మాట్లాడుతూ:
“బేస్మెంట్ పూర్తయిన తర్వాత మొదటి విడతలో రూ.లక్ష, ఇప్పుడు స్లాబ్ నిర్మాణానికీ రెండో విడతగా మరో లక్ష వచ్చాయి. చాలా ఆనందంగా ఉంది.”
సింగారం రేణుక మాట్లాడుతూ:
“మధ్యవర్తుల లేకుండా నేరుగా ఖాతాలోకి డబ్బులు రావడం విశేషం. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు.”
మాలోత్ మోహన్, ఎర్రకుంట తండా:
“పూర్వం గూన పెంకుల ఇంట్లో వర్షాల్లో ఇబ్బందులు పడేవాళ్లం.ఇప్పుడు ప్రభుత్వమే మాకు ఇల్లు కట్టిపెడుతోంది.”
పోచంపల్లి శోభ మాట్లాడుతూ…“నా భర్త మరణించిన తర్వాత ఇద్దరు పిల్లలతో అద్దె ఇల్లు.ఇప్పుడైతే మాకు కూడా సొంత ఇల్లు ఉందన్న గర్వం కలుగుతోంది.
పానుగంటి హేమలత చెప్పినది:
ఇల్లు కట్టుకోవడం కలలా అనిపించేది.ఇప్పుడు సాకారమైంది.మంత్రి పొంగులేటి కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు