ఈ 69న్యూస్: జనగామలో ఆదివారం నిర్వహించిన గ్రామ పాలనా అధికారుల రాత పరీక్ష ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగింది. జిల్లాలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 97 మంది అభ్యర్థులకు పరీక్ష నిర్వహించగా, 86 మంది హాజరయ్యారు. 11 మంది గైర్హాజరయ్యారు.పరీక్షా కేంద్రంలో నిర్వహణా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రిజ్వన్ బాషా షేక్ స్వయంగా తనిఖీ చేశారు. ఈ పరీక్షకు రెవెన్యూ శాఖకు చెందిన పూర్వ వీఆర్వోలు, వీఆర్ఎలు హాజరయ్యారు.అధికారులు పరీక్ష నిష్పక్షపాతంగా జరిగిందని తెలిపారు.