
ఈ69న్యూస్:- జనగామ,కొడకండ్ల,స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ల పరిధిలో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ ఆరోపించారు.తప్పుడు టీఆర్, ఐడి నెంబర్ల సృష్టించి, సంబంధం లేని వ్యక్తుల పేర్లతో కొనుగోలు జరిగిందని, ఇందుకు జిల్లా స్థాయి నుంచి కిందిస్థాయి అధికారులదాకా పాత్ర ఉందని తెలిపారు.మార్కెట్లో లైసెన్స్ లేని చిల్లర కాంటాల ద్వారా అక్రమంగా పత్తి కొనుగోలు చేయడం, మిల్లుదారులు తక్కువ ధరకు పత్తి సేకరించి సిసిఐకి అమ్మడం వంటి అక్రమాలు వెలుగుచూశాయని చెప్పారు. విజిలెన్స్ శాఖ సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.