జనగామ జిల్లాలో ITDA మైదాన ప్రాంత బ్రాంచ్ ఏర్పాటు చేయాలి: CH రాజారెడ్డి డిమాండ్
Uncategorizedగిరిజన సమస్యల పరిష్కారానికి నిర్ధిష్ట చర్యలు అవసరం – గిరిజన సమాఖ్య 2వ జిల్లా మహాసభ

జనగామ, జూలై 25 (ఈ69న్యూస్):
తెలంగాణ గిరిజన సమాఖ్య 2వ జిల్లా మహాసభ జనగామ జిల్లా కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో మలోత్ సీతారాం నాయక్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ఈ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీపీఐ జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే CH రాజారెడ్డి మాట్లాడారు.అధికారాలు,మౌలిక వసతుల కొరతలతో ఎదుర్కొంటున్న గిరిజనుల కోసం జనగామ జిల్లాలో ITDA మైదాన ప్రాంత బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు:
ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, “ఆపరేషన్ కాగర్” పేరుతో ఆదివాసీ బిడ్డలను లక్ష్యంగా చేసుకుని హత్యాకాండ సాగిస్తున్నదని తీవ్రంగా మండిపడ్డారు.అడవిని బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతోంది.నక్సలైట్ పేరు మీద చంపడం కాదు, ఆదివాసీల హక్కులను కాపాడటం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు:
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో గిరిజనుల పాత్ర కీలకమైనా, ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన సమస్యల పట్ల ఎప్పుడూ స్పందించలేదని, ట్రైకార్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న వాగ్దానాలు సైతం అమలవలేదని విమర్శించారు. 2019 నుండి 2022 మధ్య కాలంలో 30,000 మంది గిరిజన నిరుద్యోగులకు 219 కోట్ల రూపాయలు పెండింగ్‌లో పెట్టారని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజన బిడ్డలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే తీవ్ర ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
కమిటీ ఎన్నికలు:
అనంతరం గిరిజన సమాఖ్య నూతన జిల్లా కమిటీని ఎన్నిక చేశారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు పాతురి సుగుణమ్మ, జిల్లా సహాయ కార్యదర్శులు అది సాయన్న,ఆకుల శ్రీనివాస్,గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి జువారి రమేష్,సీపీఐ పట్టణ కార్యదర్శి సొప్పరి సోమయ్య,గుగులోత్ సఖిబాయి,విజయ సోమునాయక్,మల్లేశం, రవీందర్,హాలునాయక్,సత్యవతి,బులి హేంలాల్,రాఘవులు తదితరులు పాల్గొన్నారు.