అంతర్గత రోడ్లు గుంతలమయం-పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్

ఈ69న్యూస్ జఫర్ఘఢ్
జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలోని అంతర్గత రోడ్లు,మురికి కాలువలు, పారిశుద్ధ్య పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని సిపిఎం పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.సోమవారం టౌన్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాపర్తి సోమయ్య,మండల కార్యదర్శివర్గ సభ్యుడు కాట సుధాకర్ మాట్లాడారు.వారు మాట్లాడుతూ..పలు కాలనీల్లో రోడ్లు గుంతలమయమై నడవలేని పరిస్థితి నెలకొన్నదని,ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం పేరుకుపోయి కాలువల్లో మురుగునీరు నిలిచిపోతున్నదని పేర్కొన్నారు.వర్షాలతో గుంతలుగా మారిన రహదారులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని,ప్రతి వాడలో సిసి రోడ్లు,కాలువలు నిర్మించాలని డిమాండ్ చేశారు.అలాగే అస్తవ్యస్తమైన పారిశుధ్య కారణంగా ప్రజలు సీజనల్ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.గ్రామపంచాయతీ అధికారులు వెంటనే స్పందించి శుభ్రత పనులు చేపట్టాలని కోరారు.ఈ సర్వే కార్యక్రమంలో నాయకులు నల్లతీగల శ్రీను,జఫర్గడ్ టౌన్ కార్యదర్శి సాకి నరసింగం,ఎల్మకంటి సుధాకర్,బాబు,సముద్రాల దుర్గయ్య,కాట బిక్షపతి,బి.అనిల్,సముద్రాల రాజు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.