జఫర్గడ్ పోలీస్ వారి సూచన
మొంథా తుఫాన్ వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జఫర్గడ్ మండల ప్రజల అప్రమత్తంగా ఉంటూ ఈ క్రింది జాగ్రత్తలు పాటించండి
- నీటితో నిండిన రహదారులు,వాగులు దాటకండి
- వరద నీళ్లు ఇంట్లోకి ప్రవేశించే అవకాశం ఉంటే ముందుగానే సురక్షిత ప్రదేశాలకు వెళ్ళండి 3. కూలిపోయే ప్రమాదం ఉన్న ఇళ్లలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి
- కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉన్నందువలన విద్యుత్ పోల్స్ ను తాకరాదు మరియు వాటి దగ్గరకు కూడా వెళ్ళరాదు
5.ఇల్లు చుట్టుపక్కల నీరు నిలువ ఉండకుండా డ్రైనేజీలను శుభ్రం చేసుకోండి 6.భారీ వర్షాలు నేపథ్యంలో పిడుగులు పడే అవకాశం ఉన్నందువలన చెట్ల కింద మరియు ఖాళీ ప్రదేశాలలో నిలబడి ఉండరాదు.
జఫర్గడ్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసువారి సూచనలను పాటిస్తూ భారీ వర్షాలకు సంబంధించి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే పోలీస్ వారికి తెలియజేయవలసిందిగా సూచిస్తున్నాము..