
ఈ69న్యూస్ జనగామ:-జఫర్గడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్ల కొరతపై ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) నిరసన తెలిపింది.జిల్లా కార్యదర్శి ఎండి షబానా హాస్పిటల్‌ను సందర్శించి పేషెంట్లు,సిబ్బందితో మాట్లాడి పరిస్థితిని పరిశీలించారు.ప్రస్తుతం డిప్యూటేషన్ పై ఉన్న డాక్టర్లతో సేవలు కొనసాగుతుండగా,రోజూ 150-200 మంది పేషెంట్లు,10 మంది డయాలసిస్ పేషెంట్లు వస్తున్నారని తెలిపారు.ఎక్స్‌రే యంత్రం ఉన్నా టెక్నీషియన్ లేడు.బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నాన్నారు.ఇక్కడ వైద్య సదుపాయాలు పూర్తిగా లేనందున వేరే హాస్పిటళ్లకు వెళ్లాల్సి వస్తోందన్నారు.ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.