ఈ69 న్యూస్, పామిడి. అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మరియు అహుడా చైర్మన్ టిసీ.వరుణ్ ని గురువారం అహుడ చైర్మన్ కార్యాలయము నందు పామిడి జనసేన పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ పామిడి లో జనసేన పార్టీ గత కొద్ది రోజులు ఉండి పార్టీ కి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తుంటే కొంతమంది పార్టీలో ఉన్నవారు మాకు తెలియకుండా మీరు చేస్తే ఎలా ఏదైనా మాకు చెప్పే చేయాలని హుక్కుమ్ జారీ చేస్తున్నారని పా మిడి మండల జనసైనికులు జిల్లా అధ్యక్షుడికి సమస్యలు తెలియజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు టిసి. వరుణ్ మాట్లాడుతూ మీరు పార్టీ కోసం ఎవరైనా పని చేయొచ్చు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించింది అందరి కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఎక్కడైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే మీరందరినీ కలిపి పార్టీ కోసం పనిచేసేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పామిడి మండల ప్రధాన కార్యదర్శి షేక్షావలి,సంయుక్త కార్యదర్శి జమీర్, జనసేన పార్టీ నాయకులు వడ్డే రాము, లాయర్ సతీష్, కత్రిమల సుబ్బు, సిద్ధ,చిన్న, అశోక్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.