
సీఐటీయూ నాయకుల నోటీసు
సీఐటీయూ నాయకుల నోటీసు
ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్,జూన్ 26:
దేశవ్యాప్తంగా జులై 9న నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ కార్మికులు భారీగా పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు పిలుపునిచ్చారు.గురువారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాధాకృష్ణకు సమ్మె నోటీసు అందజేశారు.లేబర్ కోడ్ల రద్దు,ప్రైవేటీకరణకు వ్యతిరేకత,ఔట్సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వతీకరణ,కనీస వేతనం రూ.26,000/- గా నిర్ణయం,ప్రమోషన్లు,కార్మిక భద్రత,మరణించిన వారి కుటుంబాలకు ఉద్యోగ అవకాశం తదితర డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.కార్యక్రమంలో యూనియన్ నేతలు,మున్సిపల్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.