కీర్తి రెడ్డి గడప గడపకు వెళ్లి నేను భారతీయ జనతా పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గా కమలం పువ్వు గుర్తుకు మీద పోటీ చేస్తున్నాను కావున మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరడం జరిగింది.అంతేకాకుండా సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం కొనసాగించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కీర్తి రెడ్డి మాట్లాడుతూ,మీ గ్రామంలో అభివృద్ధి కావాలి అంటే భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకే మన ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు.ఒక్క ఇంటిని తీర్చిదిద్దేది మహిళలు కాబట్టి మీరు అందరూ కలిసి ఐక్యతా తో కలిసి నన్ను గెలిపిస్తే మీ గ్రామాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.అంతేకాకుండా భూపాలపల్లి నియోజకవర్గం లో పదవుల కోసం పార్టీలు మారే వ్యక్తులను కాకుండా పార్టీ కోసం కష్టపడి భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసే నాకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.గండ్ర వెంకటరమణారెడ్డి పోయిన సారి ఎన్నికల్లో ఇదే కేసీఆర్ నూ బోంద పెడుతును అన్నారు.ఇప్పుడు అదే రమణారెడ్డి కేసీఆర్ దేవుడు అంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు.ప్యాకేజీల కోసం పార్టీలు మారే నాయకులరా ఖబర్దార్,గండ్ర సత్యనారాయణ రావు అంగీలు మార్చినట్లు పార్టీలు మారుతున్నాడు మీరు ఖచ్చితంగా మీ ఓటు కమలం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలి కీర్తి రెడ్డి కోరారు.భారతీయ జనతా పార్టీ మ్యానిఫెస్టోలో అన్ని రకాల కులాలకు వర్గాలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో మ్యానిఫెస్టోలో పెట్టడం జరిగింది కావున దయచేసి గమనించగలరు భూపాలపల్లి నియోజకవర్గం లో కమలం పువ్వు గుర్తుకే మీ ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు.బిజెపి అధికారంలోకి వస్తే బి సి నాయకుడు ముఖ్యమంత్రి,సోంత ఇంటి కళ నేరవేస్తాం,ఉచిత రేషన్ బియ్యం,అర్హులందరికీ పింఛను అందిస్తాం,మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు మంజూరు. కీర్తి రెడ్డి సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రచారం లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు బూత్ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇంచార్జీ మరియు సీనియర్ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.