
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి శుభాకాంక్షలు
ఈరోజు కామారెడ్డి మున్సిపల్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి సిఐటియు ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా ఉత్సవాలు జరపడం జరిగింది
కే చంద్రశేఖర్ సిఐటియు జిల్లా కన్వీనర్ కే రాజనర్సు రాష్ట్ర కార్యదర్శి మున్సిపల్ యూనియన్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు వివిధ రంగాల్లో సుప్రసిద్ధులైన దేశానికి ఎనలేని సేవలు అందించిన మహానుభావులు అనేకుల చరిత్ర పుట్టలో మనకు కనిపిస్తారు అయితే చరిత్ర గతిని మార్చేసే యుగపురుషులు వారిలొ కొద్ది మంది మాత్రమే ఉంటారు అట్టి వారిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం పేదరీకాన్ని కూడా లెక్కచేయకుండా ఉన్నత చదువులు చదివి భారత రాజ్యాంగాన్ని రాసి ఈ దేశానికి దిశా నిర్దేశాన్ని అందించారు
ఈరోజు భారత రాజ్యాంగం పైన అనేక కుట్రలు జరుగుతున్నాయి బిజెపి ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ మనుధర్మాన్ని అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఎత్తివేయాలని ప్రయత్నం చేశారు అలాగే రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్నారు అలాంటి బీజేపీకి బుద్ధి చెప్పాలంటే మన ఏకైక మార్గం మహా మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కార్మిక చట్టాలను మహిళా చట్టాలను ఇలా అనేక చట్టాలను తీసివేయాలని ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ బిజెపి కుట్ర చేస్తున్నది
పేద ప్రజలకు అందుబాటులో ఉన్న రైల్వే .రక్షణ రంగాలను. బిఎస్ఎన్ఎల్. హెయిర్ లైన్.పోస్ట్ ఆపీస్. ఇలా ప్రభుత్వ ఆస్తులను బడా పెట్టుబడుదారులకు కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగిస్తున్నది
కావున సమ సమాజం నిర్మాణం కావాలన్నా* కులరహిత సమాజం* నిర్మాణం కావాలన్నా బాబా సాహెబ్ అంబేద్కర్ కలలు నిజం కావాలన్నా బిజెపి ఆర్ఎస్ఎస్ కుట్రలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యమై త్రిప్పుకొట్టాలా అప్పుడే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించినట్టు శ్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబెడ్కర్132 జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ జై భీములు ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు ఎండి మహబూబ్ అలీ రాజేందర్ దొబ్బల ప్రవీణ్ శ్రీకాంత్. t క్రాంతి. నవీన్. సాయిలు తదితరులు పాల్గొన్నారు