
హసన్ పర్తి, హన్మకొండ జూలై 25 (ఈ69న్యూస్):
హసన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంకెన్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన నల్గొండ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన కోనేటి అంజి బాబు (S/o యాదయ్య, వయసు: 38, వృత్తి: డ్రైవర్)ను మేజిస్ట్రేట్ వేణుగోపాల్ ఎదుట హాజరు పరిచారు.వాదనలు,సాక్ష్యాలు పరిశీలించిన అనంతరం మేజిస్ట్రేట్ కోనేటి అంజి బాబుకు 5 రోజుల జైలు శిక్ష విధించారు.శిక్షను అనుసరించి అతనిని పరకాల సబ్ జైలుకు తరలించారు.పోలీసులు డ్రంకెన్ అండ్ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు మరియు ప్రజల ప్రాణభద్రతకు ముప్పుగా మారే చర్యలపై శిక్షలు తప్పవని అధికార వర్గాలు హెచ్చరించాయి.