
తల్లాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ
తల్లాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తల్లాడ మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్ల పంపిణి కార్యక్రమం జరిగింది. మునుకూరి అప్పిరెడ్డి కుమార్తె,అల్లుడు(ఎన్నారై) సహకారంతో నిరుపేదలు, వృద్ధులు వికలాంగులు వితంతువులు వందమందికి దుప్పట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడిపల్లి నారాయణ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులుగా తల్లాడ తాసిల్దార్ సురేష్ కుమార్ మరియు ఎంపీడీవో సురేష్ బాబు అలాగే తల్లాడ సెకండ్ ఎస్ఐ బానోతు వెంకటేష్, ఈవో కృష్ణారావు నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఈ రోజుల్లో ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలి అనే భావన కలగడం ఇది ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరగటం ఎంతో విశిష్టమైనది అని వారు తెలిపారు. అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుడిపల్లి నారాయణ మాట్లాడుతూ ఎన్.ఆర్.ఐ దాతల సహకారంతో ఈ యొక్క మహోన్నతమైన సేవా కార్యక్రమాన్ని క్లబ్ చేతుల మీదగా చేయటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఇలాగే అందరం కలిసి మును ముందు ముందు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని వారు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రూపొందించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దుగ్గదేవర అజయ్ కుమార్, షేక్ ముస్తఫా,మునుకూరి అప్పి రెడ్డి, ప్రధాన కార్యదర్శి మోదుగు జయరాజు, ఉపాధ్యక్షులు గురజాల నారాయణరావు, ఉపాధ్యక్షులు షేక్ మేహారాజ్, సహాయ కార్యదర్శి రుద్రాక్ష నరసింహచారి, సహాయ కార్యదర్శి అద్దంకి సురేష్, ప్రచార కార్యదర్శి గొడ్ల శ్రీనివాసరావు, కోశాధికారి గొల్లమందల నాగబాబు, ఉప కోశాధికారి మేడి రాంబాబు, శీలం కరుణాకర్ రెడ్డి, మేడి యాకూబ్, తేలూరి చిన్న ఏసు, అద్దంకి ప్రసాద్, గుమ్మా నరేష్, షేక్ సైదా, మేడి బసవయ్య, పున్నం శ్రీనివాసరావు, ఇస్నేపల్లి బాబురావు, ఎన్ వెంకటకృష్ణ, తాళ్ల కరుణాకర్, తోట నవీన్,పూల హనుమంతరావు, వాడవల్లి నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.