
తహసీల్దార్ కి వినతిపత్రం అందచేత
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ముందు బిజెపి పార్టీ శ్రేణులు తాహశీల్దార్ కి కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు,రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బిజేపి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మండల అధ్యక్షుడు బైరపాక కుమార్ ఆధ్వర్యంలో ధర్మసాగర్ తహసీల్దార్ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రివర్యులు బిజేపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయరామారావు మాట్లాడుతూ..గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ హమీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తుందని అన్నారు.ఎన్నికల హమీలలో భాగంగా రైతులకు సన్న వడ్లకు బోనస్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.అలాగే రైతులకు సరైన సమయంలో యూరియా కొరత లేకుండా సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.మహాలక్ష్మి పథకం కింద మహిళల ఖాతాల్లో వెంటనే 2500/- రూపాయలు జమ చేయాలని అన్నారు.ఎన్నికల సమయంలో వృద్దులకు 4000/- రూపాయలు వికలాంగులకు 6000/- పెన్షన్ హమిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.కళ్యాణ లక్ష్మి షాదిముబారక్ పథకం కింద డబ్బులతో పాటు తులం బంగారం ఇచ్చి పేదింటి ఆడ బిడ్డల తల్లిదండ్రులకు అండగా నిలవాలని కోరారు