
తానేదార్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల శిలాఫలకం ఆవిష్కరణ– ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఈ69న్యూస్:- జనగామ జిల్లా తానేదార్ పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల శిలాఫలకాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆవిష్కరించారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, 112 ఇళ్లను మంజూరు చేసి రూ.1లక్ష చొప్పున లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. వర్షాకాలానికి ముందే ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. పలు సంక్షేమ పథకాలను వివరిస్తూ,కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు భరోసాగా నిలుస్తుందని తెలిపారు.