తీర్మానం ప్రవేశపెట్టిన కల్లుగీత కార్మిక సంఘం
సూర్యాపేటలో నవంబర్ 28,29,30 తేదీలలో జరిగిన రాష్ట్ర మహాసభలో కల్లుగీత కార్మికుల సమస్యలు మరోసారి బలంగా వినిపించాయి.2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కల్లుగీత కార్మికులకు ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ,కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి ప్రత్యేకంగా ఒక తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.బూడిది గోపి మాట్లాడుతూ..కల్లుగీత కార్మికుల సామాజిక భద్రత,జీవన ప్రమాణాల మెరుగుదల,విపత్తు నష్టాల పరిహారం,పాత పెన్షన్ వాగ్దానాలు,గీతల ఎక్కడానికి భద్రతా పరికరాలు,ప్రభుత్వ గుర్తింపు మరియు స్థిరమైన ఆదాయం కల్పన వంటి అంశాలన్నింటిని ప్రభుత్వం త్వరగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే,రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నుకున్న తర్వాత కార్మికుల కోసం చేపట్టాల్సిన సంక్షేమ చర్యలను వేగవంతం చేసేందుకు ఈ తీర్మానం ద్వారా రాష్ట్ర నేతలకు మహాసభ బలమైన సందేశం పంపినట్లు తెలిపారు