
E69న్యూస్ హన్మకొండ:ధర్మసాగర్ మండల కేంద్రంలోని స్వర్ణ జ్యోతి మండల సమైక్య అధ్యక్షురాలిగా అన్నం పవిత్ర-అశోక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, ఆమె జెండా ఎగరవేసి కొత్తగా తన పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఏపిఎం అనిత,సిసిలు కవిత,రామా దేవి,సంపతయ్య దానయ్య,కార్యదర్శి చంద్రకళ,కోశాధికారి అరుణ,అకౌంటెంట్ విజయ తదితరులు పాల్గొన్నారు.కొత్త అధ్యక్షురాలిని అభినందిస్తూ,భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలని ఆకాంక్షలు వ్యక్తం చేశారు.