తెలంగాణ నాల్గవ తరగతి మహిళా ఉద్యోగుల జిల్లా స్థాయి క్రీడలు
తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల ఖమ్మం జిల్లా కమిటీ మహిళా దినోత్సవ సందర్భంగా స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో ఆదివారం నాడు అత్యంత ఉత్సాహంగా మహిళా ఉద్యోగులకు జేమ్స్ ను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఆటల పోటీలను టెన్నికాయిట్ ఆడి ప్రారంభించారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడుతూ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ అందరూ మంచిగా ఉద్యోగం చేసి భవిష్యత్తులో ప్రమోషన్లు పొంది మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని ఉద్యోగులను ఈ సందర్భంగా కోరినారు అదే విధంగా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ కు ఉన్న సమస్యలన్నీ ప్రభుత్వంతో మాట్లాడి త్వరలో అన్ని పరిష్కరిస్తానని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి టీఎన్జీవో సధ్యక్ష కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాసరావు బుల్లెట్ శ్రీను, మోదుగు వేలాద్రి కారుమంచి శ్రీనివాసరావు రుక్మారావు ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జి.బిక్కు సహాయ అధ్యక్షులు ఆర్ ఓదేలు కోశాధికారి ఎం అజ్మీర్బేగ్ కాంపాటి వెంకటరమణ జిల్లా కోశాధికారి వి కనకారావు ఎస్ కే జానీ మియా జి రాంబాబు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ ని సన్మానించడం జరిగింది