తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర మూడవ మహాసభలను విజయవంతం చేయగలరు
Kamareddy డిసెంబర్ 9 10 తేదీలలో జరిగే రాష్ట్ర 3వ మహాసభలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగారపు ఎల్లయ్య మాట్లాడుతూ బీడీ ఇండస్ట్రీ పరిరక్షణ కోసం బీడీ కార్మికులు అట్లాగే నెలసరి ఉద్యోగులు ప్యాకర్స్ చాటల్ బట్టి అట్లాగే టేకదారులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాము మన కామారెడ్డి జిల్లాలో దాదాపు లక్ష మందికి పైగా బీడీ కార్మికులు బీడీ ఉపాధి పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు కానీ బీడీ కార్మికులకు ఉపయోగపడే కనీస వేతనాల జీవో అమలు చేయకపోవడం ఇప్పుడు కొన్ని కంపెనీలు మాత్రం పది రోజులు పని కల్పించడం కొన్ని కంపెనీలు ఆరు రోజులు పని కల్పించడం మరి కొన్ని కంపెనీలు 12 రోజులు పని కల్పించడం కార్మికుల జీవితాలను కాలరాసే విధంగా యాజమాన్యాలు పనిచేస్తుంటే అటు ప్రభుత్వము గతంలో పుర్రెగుర్తులని క్యాన్సర్ బొమ్మలని బీడీ కట్టల మీద అనేక ఆంక్షలు తీసుకొచ్చి జిఎస్టి పేరుతో బీడీ యజమానుల పైన కూడా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకువచ్చి బీడీ కంపెనీలు లేకుండా మూసివేసే విధంగా పనిచేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండివైఖరి మానుకోవాలని లేకపోతే రాబోయే రోజుల్లో కార్మికులు ఎంతటి పోరాటాల కైనా సిద్ధంగా ఉంటారని హెచ్చరిస్తూ ఈ మహాసభలు విజయవంతం చేయగలరని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా అధ్యక్షులు కందుకూరి చంద్రశేఖర్ జిల్లా కోశాధికారి కర్రోల్ల సత్యం తదితరులు పాల్గొన్నారు