తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డికి మరో రెండేళ్లు
మీడియా రంగానికి ప్రోత్సాహం అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డికి మరో రెండేళ్ల పాటు పదవీకాలం పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ మేరకు సంబంధిత అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.శ్రీనివాస్ రెడ్డి నాయకత్వంలో అకాడమీ చేపట్టిన పలు శిక్షణా కార్యక్రమాలు, పాత్రికేయుల అభివృద్ధి చర్యలు మరియు మీడియా రంగానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలు విశేషంగా ప్రశంసలు పొందాయి.ఆయన పదవీకాలం పొడిగింపుతో మీడియా రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా పలువురు పాత్రికేయులు, మీడియా ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డికి అభినందనలు తెలిపారు.