30 ఏప్రిల్ 2026 వరకు గడువు పొడిగింపు

హైదరాబాద్, ఫిబ్రవరి 26:
రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించిన జీఓ నంబర్ 252, సవరించిన జీఓ 103లపై దాఖలైన పిటిషన్పై తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TUWJF) తరఫున విచారణ జరిగింది.
విచారణ సందర్భంగా ప్రభుత్వం కోర్టుకు వివరణ ఇస్తూ, ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. జర్నలిస్టుల వృత్తి కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పెషల్ అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు.
పిటిషనర్ తరఫున అడ్వొకేట్ బర్కత్ అలీ ఖాన్ వాదనలు వినిపిస్తూ, జీఓ 252 మరియు సవరించిన జీఓ 103 వల్ల జర్నలిస్టుల హక్కులు, సదుపాయాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ప్రభుత్వ వాదనలను రికార్డులోకి తీసుకున్న హైకోర్టు, ప్రస్తుత అక్రిడిటేషన్ కార్డులు 2026 ఏప్రిల్ 30 వరకు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. అలాగే, జీఓలపై లేవనెత్తిన అభ్యంతరాలకు సంబంధించి పూర్తి స్థాయి వివరణను ప్రభుత్వం సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాల తర్వాతకు వాయిదా వేసింది.
ఈ మధ్యంతర ఉత్తర్వులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రిడిటెడ్ జర్నలిస్టులు ప్రభుత్వ కార్యక్రమాలు, సౌకర్యాలను ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించవచ్చు