
ఈ69న్యూస్:-నల్లగొండ జిల్లా బొక్కముంతలపాడు గ్రామానికి చెందిన దళిత మహిళ మల్లేశ్వరి ఆత్మహత్య కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, MRPS రాష్ట్ర నాయకులు ఆడెపు నాగార్జున మాదిగ నేతృత్వంలో జిల్లా కలెక్టర్కు విజ్ఞాపన పత్రం అందజేశారు.ప్రేమ పేరుతో మానసికంగా వేధించిన జాన్ రెడ్డి సహా సంబంధితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.బాధిత కుటుంబానికి ఎక్స్ గ్రేషియా సహాయం అందించాలని,అధికారుల నిర్లక్ష్యంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా MRPS నేతలు ప్రభుత్వ వ్యవస్థలపై అగ్రకులాల ప్రభావాన్ని తీవ్రంగా ఖండించారు.