
ఈ69న్యూస్ హన్మకొండ:- నల్గొండ జిల్లా బొక్క ముంతలపహాడ్కు చెందిన దళిత యువతి మల్లేశ్వరి (27), ప్రియుడు జాన్ రెడ్డి మోసం చేశాడని విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది.జాన్ రెడ్డి మరో యువతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిన మల్లేశ్వరి,హైదరాబాదులోని హాస్టల్లో విషం తాగి మరణించింది.మల్లేశ్వరి కుటుంబం,మరియు స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నేతలు హన్మకొండ కెయుసి ముందు తీవ్ర ఆందోళన చేపట్టి, నిందితుడికి ఉరిశిక్ష విధించాలని, బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.