దుమ్ము, ధూళి, రోడ్ల మరమ్మత్తులు చేయాలి
ఖమ్మం దానవాయిగూడెం పార్క్ ఏరియా వాసులు మేకల నారాయణ బోర్డు దగ్గర ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో శాబాసు వెంకటరమణ మరియు తోకల బాబు పాల్గొని మాట్లాడుతూ, మా ఏరియా లో గుంతలు పడిన రోడ్ల నుండి వచ్చే దుమ్ము, దూళి సమస్య గురించి, మున్సిపల్ కమిషనర్ కి, ఖమ్మం జిల్లా కలెక్టర్ కి, పొల్యూషన్ బోర్డుకి, ఆర్టిఏ అదికారి కి, మంత్రి కి లెటర్ ఇవ్వటం జరిగినది, కానీ ఇంత వరకు ఎవరి నుంచి కూడా స్పందన లేదు. మా ఏరియా వాసి అయిన గండ్ర వెంకటేశ్వర రావు, ఈ డస్ట్ వల్ల ఊపిరితిత్తులు పాడైపోయి చనిపోవడం జరిగింది. పెద్దవయసు వారు, చిన్న పిల్లలు ఈ డస్ట్ వల్ల తరచు హాస్పిటల్స్ చుట్టూ తిరగడం జరుగుతుంది. ఇంకా ఈ డస్ట్ కి మా ఏరియా వాళ్ల ప్ర్రాణాలు బలికాకూడదని, ఈ సమస్య మీద సంఘటితంగా, పార్టీలకు అతీతంగా పోరాటం చేద్దామని, ఏరియా వాసులం అందరం నిర్ణయించుకొని, ఈ రోజు మేకల నారాయణ బోర్డు దగ్గర వాహనాలను నిలిపివేసి, మాకు న్యాయం కల్పించాలని ధర్నా చేయడం జరిగిందని, మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరారు.
ఈ ధర్నా కార్యక్రమంలో దానవాయిగూడెం పార్క్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు.