
కార్మిక సంఘాల నేతల హెచ్చరిక
ప్రిస్టియన్ గ్రౌండ్ నుండి నెహ్రూ పార్కు కామాక్షి ఫంక్షన్ హాల్ వరకు నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయాలని కార్మిక మహా ప్రదర్శన
నాలుగు లేబర్ కోడ్ లు రద్దు చేయకుంటే
మోడీ గద్దె దిగాల్సిందే
కార్మిక సంఘాల నేతల హెచ్చరిక~~~~
జనగామ: కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా
సిఐటియు ఏఐటీయూసీ బిఆర్ టియు ఐఎన్ టియుసి జాడు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జనగామ పట్టణం ప్రిస్టియన్ గ్రౌండ్ నుండి నెహ్రూ పార్కు కామాక్షి ఫంక్షన్ హాల్ వరకు భారీ నిరసన మహా ప్రదర్శనలో కార్మిక లోకం కదం తొక్కారు
కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలు నాలుగు లేబర్ కోడ్ లు వెంటనే రద్దు చేయాలని మోడీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు
కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడకుంటే నరేంద్ర మోడీని గద్దె దించుతామని కార్మిక లోకం గర్జించింది
ర్యాలీ అనంతరం కామాక్షి ఫంక్షన్ హాల్ లో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె బహిరంగ సభ జరిగింది ఈ సభకు సిఐటియు జిల్లా అధ్యక్షులు రాపర్తి రాజు బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు వేముల నర్సింగం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆకుల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు సిహెచ్ రాజారెడ్డి సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న లు మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం స్వాతంత్రం పూర్వమే కార్మిక వర్గం బ్రిటిష్ ప్రభుత్వంపై పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి ఈ దేశంలో పెట్టుబడిదారులకు కార్పొరేట్ శక్తులకు కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కార్మిక వ్యతిరేక చట్టాలను నాలుగు లేబర్ కోడులను తీసుకురావడం సిగ్గుచేటని తీవ్రంగా మండిపడ్డారు ఈ కార్మిక వ్యతిరేక విధానాలను బిజెపి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీ చేస్తున్నారని అన్నారు కనీస వేతనం నెలకు 26000 ఇవ్వాలని కార్మిక సంఘాలు ఏళ్ల తరబడి ప్రభుత్వం పై పోరాడుతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలని అన్నారు అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత చట్టం చేయాలని నెలకు 9000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎనిమిది గంటల పనిని 10 గంటలకు పెంచే జీవో 282 ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడులు రద్దు చేసే అంతవరకు అన్ని రంగాల్లో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులందరూ ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు భవిష్యత్తులో మరిన్ని సమరశీల పోరాటాలకు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు
ఇంకా ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు విజేందర్ జనగామ ఆటో డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు జేరుపోతుల కుమార్ ఐఎన్టీయూసీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి బి ఆర్ టి యు జిల్లా నాయకురాలు టి రాధ ఏఐటీయూసీ నాయకులు చామకూరి యాకుబ్ మరి కుక్కల సాయిలు ,రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్య చందు నాయక్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు సోప్పరి సోమయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పి ఉపేందర్ వృత్తి సంఘాల రాష్ట్ర నాయకులు బూడిద గోపి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జోగు ప్రకాష్ తాండ్ర ఆనందం బి ఆర్ టి యు నాయకులు రంగమ్మ
వీఆర్ఏల జేఏసీ జిల్లా అధ్యక్షులు చింత శివ మున్సిపల్ యూనియన్ నాయకులు తిప్పారపు ప్రసాద్ పెద్దగల సుధాకర్ ఏఐటీయూసీ జిల్లా నాయకులు మోటే సిద్ధిరాములు కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బోట్ల శేఖర్ పల్లెర్ల లలిత బి ఆర్ టి యు నాయకులు రమాదేవి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు రామ్ దయాకర్ రేష్మ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దాసగొని సుమ కార్మిక సంఘాలు ప్రజాసంఘాల నాయకులు రామావతు మీట్య నాయక్ నాయకులు బోడిదే ప్రశాంత్ కచ్చగల వెంకటేష్ బొట్ల వెంకటేష్ బొట్ల ప్రశాంతి అనిల్ గంగారబోయిన మల్లేష్ రాజ్ ధరావత్ మహేందర్ భునాద్రి వెంకటేష్ బోట్ల నాగరాజు తో పాటు వందలాదిమంది వివిధ రంగాలకు చెందిన కార్మికులు పాల్గొన్నారు