వరంగల్ ట్రాఫిక్ పోలీసుల అవలక్షణదృష్టికి ఒక దొంగిలించబడిన ద్విచక్రవాహనం చిక్కింది.పోచమ్మ మైదానంలో రూటీన్ చెకింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఓ వ్యక్తి బైక్‌పై వచ్చి దూరంగా వదిలిపెట్టి పారిపోయాడు.దీనిని గమనించిన హెడ్ కానిస్టేబుల్ రవి సదరు బైక్‌ను పరిశీలించి, నంబర్ TS03-EU-4074 ఉన్న ఫ్యాషన్ ప్లస్ మోడల్ ద్విచక్ర వాహనమని గుర్తించారు.వాహన వివరాలు ట్రేస్ చేయగా,బైక్ హనుమకొండ సమ్మె నగర్‌కు చెందిన వైనాల రమేష్ అనే వ్యక్తికి సంబంధించినదిగా తేలింది.బాధితుని సంప్రదించగా,మే 28వ తేదీ రాత్రి తమ ఇంటిముందు నిలిపి ఉంచిన బైక్‌ను ఎవరో దొంగిలించారని,హనుమకొండ పోలీస్ స్టేషన్లో FIR నంబర్ 294/2025 U/S 303(2) BNS ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు.వెంటనే హెడ్ కానిస్టేబుల్ రవి బాధితునికి బైక్ దొరికిన విషయాన్ని తెలుపగా,రమేష్ హాజరైన తర్వాత వాహనాన్ని హనుమకొండ పోలీసులకు అప్పగించారు.ఈ ఘటనలో హెడ్ కానిస్టేబుల్ రవిని వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు.ట్రాఫిక్ పోలీసులు చూపిన తెలివితేటలు,బాధితునికి బైక్ తిరిగి అందించడం పట్ల స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.