దోపిడీ లేని సమాజం కోసం పరితపించే మనిషి గండ్లూరి
అమరజీవి గండూర్ కిషన్ రావు సతీమణి, బాణాపురం గ్రామ మాజీ సర్పంచ్ గండూరి నర్సుభాయమ్మ కు బుధవారం మామిళ్శగూడెంలో జరిగిన సంస్మరణ సభలో సిపిఎం పార్టీ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈనెల 9 న ఆమె అనారోగ్యంతో మరణించారు. ఈరోజు అమెకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సంస్మరణ సభలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బుగ్గవీటి సరళ మాట్లాడుతూ ఖమ్మం తాలూకా కమ్యూనిస్టు యోధుడు వీర తెలంగాణ రైతాంగ పోరాటయోధుడు కామ్రేడ్ గండూరి కిషన్ రావు బాణాపురం ఏరియాలో పేద ప్రజల పక్షాన కూలి రేట్లు పెంపుదల కోసం, మరియు కుండ కొలతల్లో అక్రమ పద్దతి తేడాకు వ్యతిరేకంగా పోరాడినటువంటి నాయకుడు కిషన్ రావు అని, అతను సతీమణి నర్సుబాయమ్మ కూడా పూర్తిగా తన జీవితాన్ని పేద ప్రజల కోసం, అణగారిన వర్గాల జనం కోసం తుది శ్వాస వరకు పోరాటం చేశారు అని కొనియాడారు.ప్రజల పక్షాన రైతుల పక్షాన నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడిగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న నాయకుడిగా ఖమ్మం తాలూకాలు కమ్యూనిస్టు నాయకుడిగా గుర్తింపు పొందిన కామ్రేడ్ గండూరి కిషన్ రావు భూస్వాములు అత్యంత దారుణంగా సర్పంచ్ గా ఉన్న సమయంలోనే ఖమ్మం టౌన్ మామిళ్ళగూడెంలోనే చంపి వేయడం జరిగింది అని తెలిపారు. ఆ తర్వాత సర్పంచిగా కామ్రేడ్ గండూరి నర్సుబాయమ్మ తన భర్త ఏ ప్రజల కోసం అయితే పోరాటం చేసే వారే ఆ ప్రజల పక్షాన పని చేస్తూ ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోవటంలో ముందు భాగాన నిలిచారు అని తెలిపారు. అగ్రకులంలో పుట్టినప్పటికీ పేదల పక్షాన పని చేసినటువంటి వ్యక్తి గండూరి నర్సుబాయమ్మ అని తెలిపారు. ఆనాడు మహిళా ఉద్యమం చేసిన మొదటి ఐదుగురు వ్యక్తుల్లో ఒకరు గండ్లూరి నర్సుభాయమ్మ ఒకరు అని తెలిపారు. నాడు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడిన అమె పోరాట పటిమను స్పూర్తితో నేడు బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది అని తెలిపారు. ఈనాడు గండ్లూరి కుటుంబ సభ్యులు సిపిఎం పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజా ఉద్యమాల్లో వున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై విక్రమ్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాదినేని రమేష్, బండి పద్మ, మెరుగు సత్యనారాయణ, సీనియర్ నాయకులు యం.సుబ్బారావు, జక్కంపూడి నాగేశ్వరరావు, పాండురంగారా, వనం నర్సింగరావు, గండ్లూరి రమాదేవి, జ్యోతి, సుధా, శైలజా, ఉమ తదితరులు పాల్గొన్నారు.