ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినమార్కెట్ కమిటీ చైర్మన్
వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మండలం పరిధిలో ఉన్న ఇల్లంద మార్కెట్ యార్డు మరియు దమ్మన్నపేట గ్రామములో ఐకెపి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు ,కొనుగోలు కేంద్రాలను వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య తోపాటుగా మండల పార్టీ అధ్యక్షుడు ఎద్దు సత్యం &బ్లాక్ అధ్యక్షుడు అభిడి రాజ్ &టెంపుల్ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్ ప్రారంబించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు .రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు సన్నాళ్లకు 2389/-, కామన్ గ్రేడుకు 2369/-మరియు దొడ్డు రకం ధాన్యాన్ని కి, క్వింటాలుకు 2389/-,కమాన్ గ్రేడుకు 2369/-, ఐకెపి కేంద్రాల్లో ధాన్యం తేమ 17 శాతం లోపే ఉండే విధంగా చూడాలని అలాగే 41 కేజీల కంటే అధిక తూకం తో కాంటాలు నిర్వహించిన వారి పై చర్యలు తీసుకుంటామని సూచించారు రైతులు ధాన్యం విక్రయించిన అనంతరం వాటిని తడవకుండా చూసుకునే బాధ్యత ఐకెపి కొనుగోలు దారులదే నని వారు అన్నారు.అదే విధంగా ఖరీదు చేయబడిన ధాన్యాన్ని ఐకెపి కేంద్రాలు ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసి గోదాముల కు తరలించాలని సూచించారు అదే విధంగా కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు అదే విధంగా రాష్ట్రములోని 43 లక్షల మంది రైతులకు 22 వేల కోట్ల రూపాయల తో రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణ మాఫీ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది రేవంత్ రెడ్డి సర్కారు ది.ఈ కార్యక్రమములో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోషాల వెంకన్నగౌడ్,మార్కెట్ డైరెక్టర్లు కర్ర మాలతి రెడ్డి, బ చ్చు గంగాధర్ రావు,ఎద్దు శ్రీనివాస్,మల్యాల దేవేందర్,అంగోత్ నాను నాయక్,అల్ల కొమురయ్య,ఇల్లంద టెంపుల్ చైర్మన్ మైదం బుచ్చి మల్లు, ఐనవోలు టెంపుల్ డైరెక్టర్ గుం టి కుమార స్వామి, దమ్మన్నపేట మాజీ సర్పంచ్ మనోహర్ రెడ్డి,ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపెల్లి యాదగిరి,ఇల్లంద గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎద్దు రాజేంద్ర ప్రసాద్,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు తుల్ల రవి, గడ్డం సమ్మయ్య,ల్యాబర్తి గ్రామ పార్టీ అధ్యక్షుడు చిద్దుముళ్ళ భాస్కర్,దికొండ ఉపేందర్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మల్లెపాక సమ్మయ్య,సురారాపు నిరంజన్ ఐకెపి సిబ్బంది హమాలీలు పాల్గొన్నారు