నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించిన వ్యక్తి పై వరంగల్ పోలీస్ కమిషనర్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ విత్తనాలు,పురుగు మందులతో పాటు కాలం తీరిన పురుగు మందులను విక్రయించిన మెహదీపట్నం ప్రాంతానికి చెందిన ముద్దంగుల ఆదిత్యపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను పరకాల ఇన్స్ స్పెక్టర్ క్రాంతి కుమార్ నిందితుడికి పరకాల జైలులో అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు.పీడీ యాక్ట్ అందుకున్న నిందితుడు మరో ఆరుగురు నిందితులతో కలిసి ఒక ముఠా ఏర్పడికాలం తీరిన పురుగు మందులను ఫర్టిలైజర్ డీలర్ల నుండి తక్కువ డబ్బుకు కొనుగోలు చేయడంతో పాటు నకిలీ విత్తనాలు,పురుగు మందులను రైతులకు విక్రయిస్తూ పరకాల పోలీసులకు గత జూన్ 6 తారీఖున నిందితుడిని అరెస్ట్ చేశారు.ముఠా నుండి పోలీసులు సుమారు 63 లక్షల 622 వేల రూపాయల విలువ గల నకిలీ విత్తనాలు, పురుగు మందులను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది.నిందితుడు పై గతంలోను నిందితుడిపై మట్టెవాడ పోలీస్ స్టేషన్ మూడు కేసులు, పరకాల పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదు కాబడ్డాయి.ఎవరైనా రైతన్నలను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు,పురుగు మందులను విక్రయిస్తే వారి పై పీడీ యాక్ట్ నమోదు చేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.