నర్సింగరావుపల్లి గ్రామంలో ఏకగ్రీవ ఎన్నికలు
ధర్మసాగర్ మండలం నర్సింగరావుపల్లి గ్రామంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తమ కొత్త నాయకులను ఎంపిక చేసుకున్నారు. గ్రామ సర్పంచిగా యాద శోభరాణి-కుమారస్వామి దంపతులను, ఉప సర్పంచ్‌గా బండారి రమేష్ ను ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఇదే క్రమంలో గువ్వాడి ఉమారాణి, శేషాల సంధ్య, శేషాల రాజకుమార్, కొండోజు వెంకటేశ్వర్లు, చిర్ర మమత, మండల స్వప్న, గుండవరం రవీందర్రావు లని వార్డు సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. నర్సింగరావుపల్లి గ్రామం మండలంలో ఆదర్శ గ్రామంగానిలిచిపోతుంది.గ్రామ ప్రజల సమగ్ర సాయంతో ప్రజాప్రతినిధుల ఎన్నికలు సజావుగా పూర్తయ్యాయని గ్రామ ప్రజలు తెలిపారు.