నల్ల చట్టాల రద్దు కోసం పల్లె నుండి పోరు
కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పల్లెల నుండి పోరు ప్రారంభం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లూరు చంద్రశేఖర్ కార్మికులకు పిలుపునిచ్చారు.ఆదివారం ఖమ్మం జిల్లా వేంసూరు మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో బాజీ,భాషా, దూసా సత్యనారాయణచారి ల అధ్యక్షతన జరిగిన సిఐటియు ద్వితీయ గ్రామ మహాసభలో పాల్గొన్న మల్లూరు మాట్లాడుతూ మోదీ సర్కారు కార్మికుల హక్కులను హరిస్తూ లేబర్ కోడ్ లు తెచ్చిందని,రైతులకు నష్టం చేసే విత్తన సవరణ చట్టం,విద్యుతు సవరణ చట్టం తెచ్చిందని దీంతో సకల జనులకు నష్టం జరుగుతుందని కుల మతాలకతీతంగా ప్రజలను చైతన్యం చేయాలని తెలిపారు.అనంతరం నూతన గ్రామ కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.