నాచారం ఈఎస్ఐ హాస్పిటల్లో రోగులకు పండ్ల కిట్ల పంపిణీ
సికింద్రాబాద్ నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్లో శనివారం అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ శాఖ వయోజన సమితి ఆధ్వర్యంలో రోగులకు సేవా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు సుమారు 100 పండ్ల కిట్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ వయోజన మండలి సభ్యులు ఖాలిద్ మహమ్మద్ ఆలాద్దీన్ పాల్గొన్నారు.కార్యక్రమంలో మాట్లాడిన హాస్పిటల్ సూపరిండెంట్ రమేష్ బాబు అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ చేస్తున్న సేవలను ప్రశంసిస్తూ,మానవతా దృక్పథంతో ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయమని తెలిపారు.హైదరాబాద్ జిల్లా వయోజన అధ్యక్షులు సయ్యద్ అన్సార్ అహ్మద్ మాట్లాడుతూ..అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగా సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అవసరమైన వారికి అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.అదే విధంగా మౌల్వీ షేక్ నూర్ మియా మాట్లాడుతూ..సమాజ సేవ ద్వారా దేవుడి అనుగ్రహం పొందవచ్చని,ఈ కమ్యూనిటీ 200కుపైగా దేశాలలో నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో షమీమ్ అహ్మద్,తాహిర్ అహ్మద్,సుల్తాన్ అల్లాద్దీన్,యాసిన్ సలీం,పర్వేజ్ ఖాన్,జాహెద్ తదితరులు పాల్గొన్నారు.