
ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ రాష్ట్ర సదస్సులో ఎం.సాయిబాబు డిమాండ్.
సెక్యూరిటీ గార్డ్సుకు కనీస వేతన రూ.26,000/`లు నిర్ణయించాలి.
ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ రాష్ట్ర సదస్సులో ఎం.సాయిబాబు డిమాండ్.
కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ గార్డ్స్‌కు 2017 సంవత్సరంలో నిర్ణయించిన కనీస వేతనాలనే షెడ్యూల్ పరిశ్రమల్లో అమలు చేస్తున్నది. ప్రతి 5 సం॥రాలకు ఒక సారి సవరించాలిసన కనీస వేతనాలను గత 8 ఏండ్లుగా వాచ్ అండ్ వార్డ్ షెడ్యూల్లో కనీస వేతనాలు సవరించపోవడంతో కోటి మందికి పైగా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, అనుబంధ హౌస్కిపింగ్ కార్మికులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని, సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనం రూ.26,000/`లు గా నిర్ణయించాలని, కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని సిఐటియు అఖిల భారత కోశాధికారి, నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ Ê అలైడ్ వర్కర్స్ జాతీయ కన్వీనర్ ఎం.సాయిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యూనియన్ రాష్ట్ర నాయకులు ఆరోగ్యమ్మ అధ్యక్షతన రాష్ట్ర సదస్సు జరిగింది.
ఎం.సాయిబాబు మాట్లాడుతూ దేశంలో సుమారు 22 వేల ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల ఆధ్వర్యంలో కోటి మంది సెక్యూరిటీ గార్డ్లు మరియు అనుబంధంగా వివిధ రకాల పనులు చేస్తున్నారని, వీరు ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన ఉత్పత్తితో పాటు ఆ సరుకుల నిల్వ, ట్రాన్స్‌పోర్టు, పంపిణీ జరిగే అన్ని విభాగాల వద్ద పనిచేస్తున్న వీరి పని పరిస్థితులు అత్యంత దుర్భరంగా ఉన్నాయని ఆవేధన వ్యక్తం చేశారు. కనీస వేతనాలు అమలు చేయరు, అత్యధికచోట్ల 12 గంటల పని పనిచేయించుకుంటున్నారని, అదనపు గంటలకు అదనపు వేతనం ఇవ్వకుండ శ్రమదోపిడి చేస్తున్నరన్నారు. ఐడెంటిటీ కార్డులు, యూనిఫామ్, షూస్, టార్చ్ లైట్ తదితర రక్షణ పరికరాలకు ఏజెన్సీల నుండే కార్మికులకు ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ కార్మికుల నుండే డబ్బులు వసూలు చేయడం దుర్మార్గమన్నారు. సెక్యూరిటీ కార్మికులు సంఘటితమై పోరాడినచోట, కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు. పోరాటాలు లేని దగ్గర వేతన భద్రత, ఉద్యోగ భద్రత లేని పరిస్థితులు కార్మిలున్నారన్నారు.
మరో పక్క కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలలో భాగంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తెచ్చి వాటిని నిరంకుశంగా అమలు చేసేందుకు, కార్మికుల హక్కులను కాలరాసేందుకు బిజెపి ప్రభుత్వం పూనుకుంటున్నది. ఈ లేబర్ కోడ్స్ అమల్లోకి వస్తే. కార్మికోద్యమం గత 100 ఏళ్లుగా అనేక త్యాగాలతో, పోరాటాలతో సాధించుకున్న హక్కులు, ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు కొద్దోగోప్టో అమలౌతున్న కార్మిక హక్కులకు కూడా నోచుకోకుండా పోతుందన్నారు.అందుకోసమే ఈ లేబర్ కోడ్ల రద్దుకై కార్మిక సంఘాలు ఐక్య పోరాటాన్ని సన్నద్ధమైనాయని, మే 20 అఖిల భారత సార్వత్రిక సమ్మెలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ఇతర అనుబంధ కార్మికులందరూ సమ్మెలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సదస్సులో రాష్ట్ర కన్వీనర్ యాటల సోమన్న కార్యచరణ ప్రతిపాధించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రామకృష్ణ, శంకర్, జ్యోతి లక్ష్మీ, రమాదేవి, సుజాత, గోవర్ధన్, గణేష్, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.