
సిఐటియు జిల్లా కార్యదర్శి ముంజం. శ్రీనివాస్
సిఐటియు జిల్లా కార్యదర్శి ముంజం. శ్రీనివాస్
కేంద్ర బిజెపి ప్రభుత్వ విధానాలకు నిరసనగా
ఈరోజు దేశవ్యాపిత సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
స్థానిక బాలభారతి హై స్కూల్ నుండి కార్మికుల ర్యాలీ ప్రారంభమై పట్టణపుర వీధుల గుండా రాజీవ్ గాంధీ చౌరస్తాకు చేరుకొని పెద్ద ఎత్తున కార్మికులు రాస్తారోకో ధర్నాను చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి బ్రిటిష్ వారిపై సైతం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను కార్పొరేట్ ల ప్రయోజనం కోసం తీసుకువచ్చిందని విమర్శించారు.ఈ లేబర్ కోడ్ ల వల్ల కార్మికులు సమ్మె చేసే హక్కును సైతం ప్రశ్నార్ధకం చేశారని , యూనియన్ ల ఏర్పాటు యాజమాన్యాల కనుసన్నల్లో జరిగే విధానం తీసుకువచ్చారని విమర్శించారు.యూనియన్ గుర్తింపు ఎన్నికలలో 51 శాతం వస్తే తప్ప గుర్తింపు ఎన్నికలు లేకుండా చేశారని విమర్శించారు.నేడు పరిశ్రమలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని లేబర్ కోడ్ లు అమలులోకి వస్తే మరింత పెరుగుతాయని ఇప్పటికే నామమాత్రంగా ఉన్న ఫ్యాక్టరీ ల ఇన్స్పెక్టర్ ల తనికీలు భవిష్యత్ లో లేకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు ఆర్ త్రివేణి మాట్లాడుతూ స్కీం వర్కర్లకు కనీస వేతనం ఇంప్లిమెంటేషన్ నోచుకోలేదని ప్రభుత్వం ఉద్యోగులకు గుర్తించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్.సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కూషన్న రాజన్న సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నగరం పద్మ. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శంకర్. సంజీవులు తదితరులు పాల్గొన్నారు.