నియోజక వర్గానికి 500 కోట్లు
మరిపెడ మున్సిపాలిటీ కి 50 కోట్లు
కాంగ్రెస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం
ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్
మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల్లో అంతర్గత సిసి రోడ్లకు మురుగు కాలువల నిర్మాణానికి రూపాయలు 25 కోట్లు నిధులు మంజూరు జరిగి, సంబంధిత టెండర్ ప్రక్రియ పూర్తయిందని డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ అన్నారు శుక్రవారం మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మొదటి వార్డు నుండి 15 వార్డుల్లో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సారధ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన హామీల మేరకు ఒక్కోటి నెరవేరుస్తూ ప్రజల దీవెనతో ముందుకు పోతుంది అన్నారు, 500 కోట్లతో నియోజకవర్గం లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అదేవిధంగా మరిపెడ మున్సిపాలిటీకి 25 కోట్లతో రాబోయే 20 సంవత్సరాలకు పెరిగే జనాభాకు సరిపడా మంచినీరు సరఫరా జరిగే విధంగా మూడు పెద్ద ట్యాంకులు నిర్మాణం చేపట్టి ఇంటింటికి మంచినీరు అందించడం జరుగుతుంది అన్నారు సంబంధిత వాటర్ ట్యాంక్ నిర్మాణాలు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు,అంతేకాకుండా ప్రతి వార్డులోని సీసీ రోడ్డు లేని చోట సిసి రోడ్ల నిర్మాణానికి మరియు మురుగు కాలువల నిర్మాణానికి మరో 25 కోట్లు నిధుల మంజూరు జరిగిందని సంబంధిత పనులు త్వరితగతిన ప్రారంభమవుతాయని తెలిపారు,మా ప్రభుత్వం మీ దీవెనతో అధికారం చేపట్టిన రెండేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిరుపేదలకు 200 లోపు యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకం,నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున రాష్ట్రం మొత్తం నాలుగున్నర లక్షల ఇండ్లకు మంజూరు చేయడం జరిగిందని,బిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో కేవలం రెండు లక్షల ఇండ్లు మాత్రమే నిర్మించింది అని అవి కూడా పూర్తి కాలేదని అన్నారు.రైతు రుణమాఫీ. 65 వేల ఉద్యోగాల భర్తీ నిరుపేదల ఆకలి తీర్చడానికి సన్నబియ్యం పథకం వంటి పథకాలతో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముందుకు పోతున్నాం నియోజకవర్గంలో 220 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో పాటు డోర్నకల్ కేంద్రంలో పది కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్,మరిపెడ మండల కేంద్రంలో మున్సిఫ్ కోర్టు మంజూరు,33 కోట్ల తో..వంద పడకల ఆసుపత్రి నిర్మాణం శర వేగంగా జరుగుతోంది ,కావున మరిపెడ మున్సిపాలిటీ ప్రజలు ప్రజా ప్రభుత్వానికి బాసటగా నిలిచి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కీ బాసటగా నిలవాలని కోరారు, ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వంటి కొమ్ము యుగంధర్ రెడ్డి,మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, సీనియర్ నాయకులు కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, కాలం రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పానుగోత్ రాంలాల్,మాజీ ఎంపీటీసీ గంధసిరి అంబరీష,మాజీ వార్డు సభ్యులు గుండగాని వెంకన్న, కేసముద్రం మార్కెట్ వైస్ చైర్మన్ పెదబోయిన ఐలమల్లు, జిల్లా నాయకులు గూగులోత్ రవినాయక్ సీనియర్ నాయకులు నల్లు శ్రీకాంత్ రెడ్డి, గుండగాని వెంకన్న,ముదిరెడ్డి లక్ష్మారెడ్డి, కుడితి వెంకట్ రెడ్డి, షేక్ అజీజ్,ఎండి అప్సర్, వెర్మరెడ్డి వెంకట్ రెడ్డి,వీసారపు శ్రీపాల్ రెడ్డి, కుడితే నరసింహారెడ్డి,కారంపూడి ఉపేందర్,దేవరశెట్టి లక్ష్మీనారాయణ, కొంపెల్లి సురేందర్ రెడ్డి,అల్వాల ఉపేందర్,గంధసిరి బిక్షపతి,గుండ గాని వేణు, జాటోత్ సురేష్ నాయక్, భాషిపంగు రవికాంత్, గంధసిరి లక్ష్మయ్య, బయ్య బిక్షం,తమ్మనబోయిన ఉమేష్, గంట్ల గౌతంరెడ్డి,వెర్మ రెడ్డి ప్రవీణ్ రెడ్డి, సంతోష్ రెడ్డి,ముదిరెడ్డి నరేష్ రెడ్డి, గుండ గాని నరేష్ ఎస్ డి సర్వర్ పాషా, బంక ప్రమోద్,షేక్ అక్బర్, షేక్ పాషా, సుంకరి అశోక్, దూగుంట్ల వెంకన్న,బాష్పంగు ఇద్దయ్య, భాషిపంగు సైదులు,కోమటి రమేష్,దేవరశెట్టి వెంకన్న,కోమటి వీరన్న,దేవరశెట్టి వెంకన్న, బుధారపు రామచంద్రం , బుదారపు శ్రీను,రామచంద్రయ్య,షేక్ ఆషిక్ అనంతగిరి రవి,అన్ని వార్డుల ఇంచార్జులు వార్డ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు