
ఈ69న్యూస్ వేలేరు మార్చి 31
హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో నిరుపేద కుటుంబానికి చెందిన సారా శ్రీనివాస్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్,మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు బిల్లా యాదగిరి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయంగా రూ. 5,000 (ఐదు వేల రూపాయలు) అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ యాదగిరి మాట్లాడుతూ,కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న శ్రీనివాస్ మృతి చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వపరంగా అందుబాటులో ఉన్న అన్ని విధాల సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వేలేరు మేజర్ గ్రామ ఉప సర్పంచ్ శ్రీకర్, గౌడ కుల సంఘం అధ్యక్షులు కుమారు, సంఘ పెద్దలు చిరంజీవి, రమేష్, వెంకటేశ్, వీరన్న, లక్ష్మీనారాయణ, రవి, రాజశేఖర్, శ్రీను. గ్రామ పెద్దలు రాజయ్య, సునీల్, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.