నిర్దేశిత గడువులో ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలి
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.శనివారం ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు,ఎన్నికల రిటర్నింగ్ అధికారులు,సహాయ రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి,మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేసి లక్ష్యం మేరకు పూర్తి చేసే విధంగా పలు విధివిధానాలను వివరించారు.రాబోయే 12 రోజులలోగా నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేలా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని,బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల మ్యాపింగ్ నిర్వహించేలా పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు.అలాగే,బూత్ స్థాయి అధికారులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు కలిగి ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్,అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్,ఆర్డీవో గోపీరామ్తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.