
నివాళులు అర్పించిన చల్లా ధర్మారెడ్డి
బిఆర్ఎస్ సీనియర్ నాయకులు,పరకాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి తల్లి రేగూరి రంగమ్మ నిన్న సాయంత్రం మృతిచెందడం జరిగింది.విషయం తెలుసుకున్న పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి రంగమ్మ పార్దివ దేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.అనంతరం ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో పరకాల నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు ఉన్నారు.