నూతన డివిజన్ కార్యాలయ భవనాల పరిశీలన
స్టేషన్ ఘనపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి డి.ఎస్. వెంకన్న నూతనంగా నిర్మాణంలో ఉన్న డివిజన్ కార్యాలయాల సముదాయ భవనాన్ని పరిశీలించారు.నిర్మాణ పనుల పురోగతిని సమీక్షిస్తూ, పనులు నాణ్యత ప్రమాణాలతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ పరిశీలనలో ఆర్ అండ్ బి శాఖ డివిజనల్ ఇంజనీర్ సతీష్ కుమార్, విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ సారయ్య, ఆర్ డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ భాస్కర్ తదితర అధికారులు పాల్గొన్నారు.అధికారులు భవన నిర్మాణంలోని వివిధ విభాగాలను పరిశీలించి, అవసరమైన సాంకేతిక సూచనలు చేశారు