వేంసూరు మండలoలో నూతన రేషన్ దుకాణాల కొరకు దరఖాస్తుల
సత్తుపల్లి,ఆర్ సి,జనవరి09(తెలుగు గళం)న్యూస్: సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని వేంసూరు మండలoలో నూతన రేషన్ దుకాణాల కొరకు దరఖాస్తులను సబ్ కలక్టర్ అజయ్ యాదవ్ కోరారు.రామన్నపాలెం గ్రామంలో(2230018) బీసీ కు చెందిన మహిళ లేక పురుషులు,భరణిపాడు గ్రామంలో(2230010) కి ఎస్సీ రిజర్వేషన్ లో పురుషుడు లేక మహిళకు,కందుకూరు 04 వ దుకాణం(2230030) కు ఎస్సీ రిజర్వేషన్ కు చెందిన మహిళలకు అవకాశం కలదని దరఖాస్తులు చేసుకోవాలని కల్లూరు సబ్ కలక్టర్ వారి ఉత్తర్వులు 40/2026,తేదీ 08/01/2026 ప్రకారం తహశీల్దార్ మాణిక్ రావు ప్రజలను మీడియా ద్వారా కోరారు.దరఖాస్తులు స్వీకరణ శుక్రవారం నుండి ఈ నెల 20 వ తేదీ వరకు గలదని తెలిపారు.అట్టి దరఖాస్తులను ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాలు మినహా కార్యాలయ పని వేళలో కల్లూరు సబ్ కలక్టర్ కార్యాలయంలో నేరుగా సమర్పించాలని తెలిపారు.కనీస విద్యార్హత 10 వ తరగతి ఉత్తీర్ణత అవసరమని తెలిపారు.