నూతన వైన్స్ ప్రారంభం
మరిపెడ మండలంలోని సోమవారం మద్యం షాపులు ప్రారంభించారు. మరిపెడ మండలంలో మొత్తం ఐదు షాపులు మరిపెడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి,జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగేందర్ రెడ్డి, కాంగ్రెస్ యువ నాయకులు నూకల అభినవరెడ్డి తో, కలిసి మద్యం షాపులు గంగాభవాని వైన్స్, సెవెన్ హిల్స్, కనకదుర్గ వైన్స్, జి ఎన్ ఆర్ ఈగల్ వైన్స్, శ్రీ దుర్గా వైన్స్ షాప్ దుకాణాలను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైన్స్ షాప్లు ప్రభుత్వానికి ముఖ్యమైన ఆదాయ వనరులు. పన్నుల రూపంలో ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఆదాయం సంపాదించడం వల్ల అభివృద్ధి పనులకు నిధులు సమకూరుతాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల దాకా వీటి ప్రసారం ఉండడం వలన ఉద్యోగ అవకాశాలు కూడా ఏర్పడతాయి, అయితే, మద్యం విక్రయం ఒకవైపు ఆర్థిక లాభాలు కలిగిస్తే, మరోవైపు సామాజిక సమస్యలను కూడా రేకెత్తిస్తుంది. మద్యం అలవాటు పెరిగితే కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత నియంత్రణ కోల్పోవడం వంటి ప్రతికూల ఫలితాలు ఎదురుకావచ్చు. కొన్ని ప్రాంతాల్లో వైన్స్ షాప్ల వల్ల శాంతిభద్రతలు భంగం కలిగిన ఉదాహరణలు కూడా కనిపిస్తాయి అన్నారు, అందువల్ల మద్యం వినియోగం పై ప్రజల్లో అవగాహన పెంచడం, నియంత్రణ చర్యలను కఠినతరం చేయడం అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ సొసైటీ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి, పానుగోతు రామ్ లాల్, శ్రీపాల్ రెడ్డి, గంధసిరి అంబరీష, నల్లు శ్రీకాంత్ రెడ్డి,పెండ్లి శ్రీనివాస్ రెడ్డి, మెంచు అశోక్ గౌడ్,తాజుదీన్, కాలం శ్రీనివాసరెడ్డి, దుబ్బాక నరేష్ రెడ్డి, ఉరుగొండ వెంకన్న, మాసబత్తిని సతీష్, శ్రీరామ్ శ్రీనివాస్, గడ్డం వెంకన్న, రామ సాయం సత్యనారాయణ రెడ్డి, మచ్చ వెంకటరమనర్సయ్య,తదితరులు పాల్గొన్నారు.