నూతన సర్పంచ్ నీ సన్మానిస్తున్న మాజీ చైర్మన్
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం, గాలివారిగూడెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నారెడ్డి కవిత రెడ్డి సుదర్శన్ రెడ్డి సర్పంచ్ గా గెలుపొందిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ నవీన్ రావు నీ వారి నివాసం బీచ్ రాజ్ పల్లి గ్రామం లో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్బంగా నూతన సర్పంచ్ గా ఎన్నికైన కవిత సుదర్శన్ రెడ్డి నీ శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు,ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికై మీ తోడ్పాటు ఎప్పటికీ ఉండాలని నీపై నమ్మకంతో గెలిపించిన మీ గ్రామ ప్రజల కష్టసుఖాలలో పాలుపంచుకోవాలని వారికి పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు శేఖర్ రెడ్డి, సీతారామ్ రెడ్డి, ఉపసర్పంచ్ ఎల్లయ్య, మాజీ సర్పంచ్ వెంకన్న, నాగేష్, తదితరులు పాల్గొన్నారు