నేత్ర పర్వంగా ఆండాళ్ పల్లకీ సేవ
ధనుర్మాసం పురస్కరించుకుని మున్సిపల్ కేంద్రంలోని శ్రీ సీతరామాంజనేయ ఆలయం లో వేడుకలు నేత్ర పర్వంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం ఆండాళ్ ప్రవచించిన పాశురాల పఠనం తో ఆలయ లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గోదాదేవి పల్లకీ సేవ ను ఆలయ పుర వీధుల్లో గోవింద నామ స్మరణల ఊరేగింపు చేశారు. అనంతరం భక్తులు సామూహిక విష్ణు సహస్ర నామ స్తోత్రం పారాయణం చేశారు. కార్యక్రమంలో బీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పల నాగేశ్వర రావు, గంట్ల రంగా రెడ్డి,బోనగిరి సత్యనారాయణ, ఉల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు