నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం-ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
Uncategorized

ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
శాంతి భద్రతల పరిరక్షణకు సీసీ కెమెరాలే అసలైన ఆయుధాలని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం కొత్తపల్లి గోరి మండలంలోని బాలయ్యపల్లి గ్రామంలో స్థానిక పోలీసు శాఖ ప్రోత్సాహంతో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తొట్ల తిరుపతి యాదవ్ సహకారంతో రూ. 1.20 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఎమ్మెల్యే గండ్ర అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ గ్రామాల్లో నేరాలు, దొంగతనాలను సమర్థవంతంగా అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే, నేరస్తులను తక్షణమే గుర్తించి, అరెస్టు చేయడానికి పోలీసులకు సీసీ కెమెరాలు అత్యంత విలువైన ఆధారాలను అందిస్తాయని వివరించారు. నేర పరిశోధనలో ఇవి పోలీసుల మిత్రుడిగా నిలుస్తాయని ఆయన ప్రశంసించారు. రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, నివాస కాలనీలు, ఇళ్ల వద్ద ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన ఆవశ్యకతను ఎమ్మెల్యే గండ్ర వివరించారు. సామాజిక భద్రతకు ఇది తప్పనిసరి అని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల తోడ్పాటులో ప్రజలు భాగస్వాములై నేరాలను అరికట్టాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావును తొట్ల తిరుపతి కుటుంబ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల సిఐ మల్లేష్ యాదవ్, రేగొండ రెండవ ఎస్సై షాఖాన్, మార్కెట్ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య, ఎంపీడీవో రాంప్రసాద్, పంచాయతీ కార్యదర్శి సరిత, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్పకాల నరసయ్య, నాయకులు పున్నం రవి, పట్టెమ్ శంకర్, బైకాని కుమార్, పొన్నగంటి వీరబ్రహ్మం, మేకల బిక్షపతి, వావిలాల రమేష్, బోయిని వినోద్, పత్తి ప్రభాకర్, తోకల సురేందర్ రెడ్డి, పంగ ఐలయ్య, గట్టు ప్రదీప్, సురం వీరేందర్, మధసు చిరంజీవి, తోట్ల పెద్ద తిరుపతి, తొట్లా శివకుమార్, వంగ కొమురయ్య, వంగ సాంబయ్య, శ్రీపతి సాంబయ్య, శ్రీపతి కుమార్, తోట్లా కుమారస్వామి తది తరులు పాల్గొన్నారు.